జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈమూవీ షూటింగ్ లో పాల్గోంటారని సినీ వర్గాల సమాచారం. ఇక ఈమూవీకి ఎంసీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈనెల 20నుంచి వరుసగా 20రోజులు షూటింగ్ లో పాల్గొననున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఈమూవీకి సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ నటించే ఈమూవీ విడుదల తేదీని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. 2020మే 23వ తేదిన ఈమూవీని విడుదల చేయనున్నట్లు సమచారం. పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందడగ..అంజలి .. నివేద థామస్ .. అనన్యలను ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాకోసం పవన్ భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. చివరగా పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత పవన్ సినిమాల్లో నటించడంతో ఈమూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.