ఉగ్రవాదులకు గట్టి బుద్ది చెప్పాం: పవన్

13
- Advertisement -

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని పాక్ ఉగ్రవాదులకు భారత్ బలంగా బుద్ధి చెప్పిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పహల్గాం ఘటనలో హిందువులను అత్యంత దారుణంగా చంపారు అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతదేశం కోరుకుంది అన్నారు.

ఆపరేషన్ సిందూర్ లో ఎక్కడా పాక్ ఆర్మీపై గానీ, పౌరులపై గానీ దాడి చేయలేదు అన్నారు. కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే సైన్యం ధ్వంసం చేసింది.. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టిన ప్రధాని మోడీకి, సైన్యానికి దేశం మొత్తం అండగా ఉంటుంది అన్నారు. సోషల్ ‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దేశాన్ని, సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కేసులు పెడతాం అని హెచ్చరించారు. సరిహద్దుల్లో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో అందరం బాధ్యతాయుతంగా ఉండాలి.. ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దు అన్నారు.

ఇది ఆరంభం మాత్రమే.. ఉగ్రవాదంపై యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుంది అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలి..ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది అన్నారు.

Also Read:భార‌త సైన్యానికి సెల్యూట్ :కేటీఆర్

- Advertisement -