అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 22వ తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈసందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పలువురు సినీ , రాజకీయ ప్రముఖులతో అమెరికా మెరిసిపోతుంది. ఇక ఈమహాసభల్లో ఓ కీలక సంఘటన చోటుచేసుకుంది. బీజేపీలో కీలక నేతతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరూ కలిసి దాదాపు గంటకు పైగా సమావేశమయినట్లు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయాలపై వారు చర్చించారని సమాచారం. ఏపీలో నెలరోజుల వైఎస్ జగన్ పరిపాలనపై ఇరువురి మధ్య చర్చ జరగ్గా.. విభజన హామీలు, ఏపీకి కేంద్రం చేసిన సాయంపై కూడా చర్చించారు.
జాతీయ రాజకీయాలు, ఏపీకి కేంద్రం ఇంకా ఏం చేయాల్సి ఉందన్న అంశంపైనా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ భేటీ పై పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.