కాటమరాయుడుపై శృతిహాసన్ కామెంట్‌….!

281
Pawan Kalyan Is Special To Work With, Says Shruti Haasan
- Advertisement -

పవన్‌కళ్యాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ కాటమరాయుడు ఈసినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 80శాతం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇటీవలే పవన్‌ అమెరికా నుంచి వచ్చిన తర్వాత సినిమాను రీషూట్‌ చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. రీషూట్‌ కారణంగా సినిమా మరికొన్ని రోజులపాటు ఆలస్యం కావచ్చు. అనుకున్న సమయానికి రిలీజ్‌ కూడా కాకపోవచ్చు.

Pawan Kalyan Is Special To Work With, Says Shruti Haasan

అయితే ఈసినిమా యూనిట్ వరుసగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఫోటోలు కూడా పెద్దగా ఆసక్తిని రేకేత్తించలేదు..దీంతో రిలీజ్ కు ముందే కాటమరాయుడు మూవీ కూడా గబ్బర్ సింగ్‌లా మరో ఫ్లాప్‌గా మిగిలిపోనుందని చిత్రపరిశ్రమలో రూమర్స్ వినిపించాయి. దీం తర్వాత వచ్చిన టీజర్ తో పవన్ తన సత్తా ఏంటో చూపించాడు..విడుదలైన రెండు రోజుల్లో కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో అన్ని రికార్డులు బ్రేక్‌ చేసింది..దీంతో కాటమరాయుడిపై భారీ అంచనలే నెలకొన్నాయి. ఈ మూవీ కొలీవుడ్‌ వీరంకు రీమేక్‌గా రూపొందుతున్న సంగతి విధితమే.

Pawan Kalyan Is Special To Work With, Says Shruti Haasan

తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కాటమరాయుడుపై ఊహించని కామెంట్స్ చేసింది. కాటమరాయుడు చిత్రం పక్కాగా తమిళ సినిమా వీరం కు రీమేక్ గా వస్తుందని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇది రీమేకే కానీ..ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులుంటాయని చెప్పింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో నటిస్తుండటం పట్ల శ్రుతి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది..‘‘పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా స్పెషల్. అలాగే మా కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కూడా. నా కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ అది. దాని తర్వాత మళ్లీ మేం ‘కాటమరాయుడు’ సినిమాకు కలిసి పని చేశాం. ఈ సినిమా కూడా నాకు చాలా ప్రత్యేకం. ఇది రీమేకే అయినా.. ఒరిజినల్ లాగా ఉండదు. ఎవ్వరూ కూడా రీమేక్ సినిమా చేస్తున్నపుడు ఉన్నదున్నట్లు దించేయాలని అనుకోరు.
Pawan Kalyan Is Special To Work With, Says Shruti Haasan
లోకల్ ఆడియన్స్ టేస్ట్, వాళ్ల సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగా మార్పులు చేస్తారు. ‘కాటమరాయుడు’ విషయంలోనూ అలాగే చేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు. ఒరిజినల్ తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. నా పాత్ర కూడా మార్చారు. ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుంతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది” అని శ్రుతిహాసన్ కాటమరాయుడు గురించి ఈవిధంగా కామెంట్స్‌ చేసింది.మొత్తం మీద శృతిహాసన్‌ కాటమరాయుడు సినిమా రిలీజ్‌కు ముందు బ్లాక్‌ బాస్టర్‌ అని ప్రకటించడంతో పవన్‌ఫ్యాన్స్‌  తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

- Advertisement -