బాలకృష్ణ-పూరీ సినిమాకు డేట్‌ ఫిక్స్‌….

188
Balakrishna 101 Movie Confirmed with Puri Jagannadh
- Advertisement -

ఎట్టకేలకి బాలయ్య 101సినిమాకు లైన్‌ క్లియరైంది. కొద్ది రోజులుగా బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూసున్న 101చిత్ర త్వరలోనే పట్టాలెక్కనుంది. దర్శకుడు పూర్తి జగన్నాథ్‌ తన ట్వీట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.‘‘రాకింగ్ అనౌన్స్ మెంట్. బాలకృష్ణగారితో… భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను’’ అంటూ పూరి జగన్నాథ్ ట్వీట్ చేశాడు.

Balakrishna 101 Movie Confirmed with Puri Jagannadh

ఈసినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు మార్చి 9న ప్రారంభించి,సెప్టెంబర్‌ 29న సినిమా విడుదల చేస్తామని కూడా పూరి వెల్లడించారు. క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య చేసిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అమిత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనా కౌశలానికి అందరూ ఫిదా అయ్యారు. కెరీర్‌పరంగా ఆ సినిమాతో ఓ మైలురాయిని అందుకున్న ఆయన.. తర్వాత ఏ సినిమా చేస్తారనే దానిపై రకరకాల వార్తలు వినిపించాయి. తమిళ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన 101వ సినిమా చేయబోతున్నారంటూ సోషల్‌మీడియాలోనూ జోరుగా ప్రచారం నడిచింది.

అయితే ఈ ఊహాగానాలకు పూరి జగన్నాథ్‌ తన ఒక ట్వీట్‌తో ఈవార్తలన్నింటికి బ్రేక్‌ వేశాడు.మొత్తానికి బాలయ్యను పూరి ఎలా ప్రెజెంట్‌ చేయబోతున్నాడనేది ఖచ్చితంగా బాలయ్య  ఫ్యాన్స్‌ కి ఎక్సయిటింగ్‌ ఎలిమెంటే అని చెప్పొచ్చు.

- Advertisement -