ఏపీలో వచ్చే ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీల మద్య పొత్తు అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే పొత్తు ఒక్కటే మార్గమని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ మూడు పార్టీల మద్య పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చింది కూడా. ఆల్రెడీ జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీ కూడా అల్మోస్ట్ ఈ రెండు పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్దమైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ అనూహ్యంగా ట్విస్ట్ ఇవ్వబోతున్నారనే టాక్ ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది. .
అసలు పొత్తే లేకుండా ఎన్నికల బరిలో నిలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు టాక్. అయితే ఇప్పటివరకు పొత్తుపై అందరి కంటే ముందు పవనే ఆతురత ప్రదర్శిస్తూ వచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. అందుకోసం తాను పొత్తుకు సిద్దమే అని చెబుతూ వచ్చారు. అందుకోసమే బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో సక్యతతో మెలుగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పొత్తు విషయంలో యుటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట పవన్. ఎందుకంటే మూడు పార్టీలు కలిస్తే సీట్ల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న సీట్లను కూడా ఇతర పార్టీలకు ఇవ్వాల్సి వస్తుంది.
Also Read:రాహుల్ గాంధీ..ఈసారి కూడా కష్టమే?
ఇదే ఇప్పుడు పవన్ ను కన్ఫ్యూజన్ లో పడేస్తోందట. ప్రస్తుతం ఏపీలో జనసేన బలం బాగానే పెరిగింది ఎలాంటి పొత్తు లేకుండానే 20 నుంచి 40 స్థానాలు గెలుచుకునే సామర్థ్యం జనసేన పార్టీకి ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే గనుక జరిగితే టీడీపీ, వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశం లేదు. దీంతో హంగ్ ఏర్పడిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎలాంటి పొత్తు లేకుండానే పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నాడట జనసేనాని. అందుకే నియోజిక వర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను పవన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి పవన్ పొత్తులోనే కొనసాగుతారా ? లేదా పొత్తు నుంచి బయటకు వస్తారా అనేది చూడాలి.
Also Read:కేసిఆర్ బరిలో దిగేది..అక్కడినుంచే?