పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్రెండ్‌షిప్‌కు ఎంత విలువ ఇస్తాడో అందరికీ తెలిసిందే. పవన్‌కు ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో త్రివిక్రమ్,అలీ,నిర్మాత శరత్ మరార్ ఒకరు. పవన్‌కి సంబంధించిన ఏ సినిమాలోనైనా అలీ ఉండాల్సిందే. అదేవిధంగా త్రివిక్రమ్ సైతం పవన్‌కి అత్యంత ఆప్తుల్లో ఒకరు. ఇక నిర్మాత శరత్ మరార్‌తో పవన్ మధ్య ఉండే స్నేహం గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
‘జానీ’ సినిమా నుండి పెనవేసుకున్న వీరి సాన్నిహిత్యం ఇప్పుడు పూర్తిగా దూరం అయింది అన్న వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ లో తెగ హడావిడి చేస్తున్నాయి. శరత్ మరార్ ను నిర్మాతను చేసి పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలను తీశాడు. అయితే ఈరెండు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోయినా ఈ రెండు సినిమాల మార్కెట్ మటుకు విపరీతంగా జరగడంతో ఈరెండు సినిమాలు విడుదల కాకుండానే శరత్ మరార్ కు లాభాలను తెచ్చి పెట్టాయి.
కానీ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ఘోర పరాజయం తరువాత తీవ్రంగా నష్టపోయిన ఆ సినిమా బయ్యర్లు తమకు ఆ నష్టాలు తీర్చమని శరత్ మరార్ పై తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో పవన్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో శరత్ బాగా అప్సెట్ అయ్యాడట.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో అలీ, త్రివిక్రమ్ లాంటి పవన్ కళ్యాణ్ సన్నిహితులంతా హాజరయ్యారు. నిర్మాత సురేశ్ బాబు లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ వేడుకలో శరత్ మరార్ కనిపించలేదు. దీంతో పవన్, శరత్ మధ్య దూరం పెరిగిందని పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే పవన్ సన్నిహితులు మాత్రం వీరి స్నేహ బంధం బలమైందని, చిన్న చిన్న కారణాలకే వారు విడిపోరని చెబుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప పుకార్లకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు.