పవన్‌ సెంటిమెంట్‌ కు బలైన హీరోయిన్లు వీరే..

241
These are the heroines who are strong for Pawan's sentiment
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో తారలుగా ఓ వెలుగు వెలిగి ఒక్కసారిగా కనుమరుగైన వారు చాలా మందే ఉన్నారు. దీనికి కారణం సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ బలంగా ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. చిత్ర పరిశ్రమలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటించిన హీరో తదుపరి చిత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న అపవాదు ఉంది. ఇది ఇప్పటికి చాలా సార్లు నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా బాలయ్యబాబు సినిమాలో సింహ అనే పదం ఉంటే ఆ సినిమా రికార్డు బద్దలు కొడుతుందన్న విశ్వాసం కూడా ఉంది. ఇక మహేష్ బాబు సినిమా మూడు అక్షరాలతో ఉంటే ఆ సినిమా సూపర్‌ హిట్‌.. ఇలాంటివి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే సెంటిమెంట్స్‌ ఉన్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా మరో సెంటిమెంట్‌ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాఫిక్‌ మారింది. ఇదేంటంటే.. పవన్‌ కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌ గా నటిస్తే.. ఇక ఆ హీరోయిన్‌ కెరియర్‌ కు పుల్ స్టాప్‌ పడినట్టేనన్న చర్చ జరుగుతోంది. ఇది వినడానికి ఒక్క క్షణం నిజంగానే అనిపిస్తోందనే చెప్పొచ్చు.. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌ సరసన హీరోయిన్స్‌ గా నటించిన చాలా మంది కెరియర్‌ ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి.

ఒకసారి ఇప్పటివరకు పవన్‌ తో నటించిన హీరోయిన్లను ఒక్కసారి పరిశీలిస్తే…. పవన్‌ కళ్యాణ్‌ – దేవయాని కాంబినేషన్‌ లో తెరకెక్కిన సినిమా తర్వాత.. దేవయాని మళ్లీ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌ పవన్‌ సరసన హీరోయిన్‌ గా నటించింది. ఆ తర్వాత రేణూ కెరియర్‌ కు పుల్‌ స్టాప్‌ పడింది. పవన్ సరసన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌ గా నటించిన సుప్రియ కెరియర్‌ కూడా ముగిసిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ప్రీతి జింగ్యానీ కూడా చెప్పుకోదగ్గా రేంజ్‌ లో సినిమాల్లో నటించలేదనే చెప్పాలి.

ఇక పవన్‌ కళ్యాణ్‌ సినిమా కెరియర్‌ లోనే బిగ్గెస్ట్ హిట్‌ తొలిప్రేమ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన కీర్తి రెడ్డి చేసిన సినిమాలు వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. తర్వాత బద్రి సినిమాలో పవన్‌ సరసన నటించిన అమీషా పటేల్ కూడా పవన్‌ సెంటిమెంట్‌ కు బలైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయారు. ఇక గుడుంబా శంకర్‌ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్న హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ కెరియర్‌ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ముందుకు సాగలేదు.

Gudumba Shankar movie HD wallpaper Pawan Kalyan Meera Jasmine in 2022 | Final fantasy girls, Kalyan, Asian beauty girl

తర్వాత జల్సా సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ఇలియానా పరిస్థితి కూడా ఇంతే.. ఇలా పవన్‌ కళ్యాణ్‌ సెంటిమెంట్‌ తో కెరియర్‌ ముగిసిపోయిన హీరోయిన్లు 10 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా పవన్‌ కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శ్రీలీల పవన్‌ సరసన నటిస్తోందన్న వార్తలు రాగానే.. నెటిజన్లు పవన్‌ సెంటిమెంట్‌ ను గుర్తుచేస్తున్నారు.. ముందు ముందు పవన్‌ సెంటిమెంట్‌ హీరోయిన్లకు ప్లస్సా.. మైనస్సా అనేది చూడాలి.

Ileana D Cruz to play Pawan Kalyan wife?

ఇవి కూడా చదవండి

ఆ తప్పే ఉదయభాను కెరియర్‌ ను నాశనం చేసిందా?

నెట్టింట హల్చల్‌ చేస్తున్న జోర్దార్‌ జంట

బ్లూ గౌన్‌లో మెరిసిపోతున్న సౌమ్యారావు

- Advertisement -