దెబ్బేసిన పవన్.. ఎన్డీయేకు గుడ్ బై!

32
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా పొత్తుల విషయంలో ఏ పార్టీ ఎటువైపు వెళుతుందో విశ్లేషకుల అంచనాలకు సైతం అందడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  అనుసరిస్తున్న వ్యూహాలు ఎవరికి అంతుచిక్కడం లేదు. బీజేపీతో పొత్తు లో ఉంటూనే అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారాయన. అలాగని బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారా అంటే ఆ మద్య టీడీపీతో ఉన్నప్పటికి బీజేపీతో దోస్తీ కొనసాగిస్తామని రెండు పడవల ప్రయాణం చేశారు పవన్. దాంతో కమలనాథులు సైతం ఊపిరి పిల్చుకొని జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని చెబుతూ వచ్చారు.

కానీ టీడీపీతో పొత్తు విషయంలో మాత్రం ఏమో డౌటే అన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ ఇచ్చిన స్ట్రోక్ బీజేపీ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. కృష్ణజిల్లా పెడనలో జరిగిన వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంటే బీజేపీలో కల్లోలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెబుతూ.. జనసేన ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారయన. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మాత్రమే కలిసి పోటీ చేయబోతున్నాయని పవన్ చెప్పకనే చెప్పారు.

దీంతో ఒక్కసారిగా పవన్ ప్లేట్ మార్చడంతో బీజేపీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఎందుకంటే ఏపీలో బలపడేందుకు పూర్తిగా జనసేనపైనే ఆధారపడ్డ కాషాయ పార్టీకి ఉన్న ఒక్క ఆధారం కూడా పోవడంతో ఏపీలో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్ హటాత్తుగా ఎన్డీయే నుంచి ఎందుకు బయటకు వచ్చారనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తులో ఉండడం వల్ల క్రిస్టియన్, మైనారిటీ ఓటు బ్యాంకు మిస్ అయ్యే అవకాశం ఉందని అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఎన్డీయేలో ఉండడంవల్ల నష్టమే తప్పా లాభం లేదని భావించి పవన్ వ్యూహాత్మకంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఎన్డీయే నుంచి జనసేన బయటకు వెళ్ళడం బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి.

- Advertisement -