Pawan:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్

2
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. ఈ నెల 20న అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఈ నెల 16, 17న పవన్‌ కల్యాణ్‌ ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొననున్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సైతం పర్యటించనున్నారు పవన్. పలు సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.

బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు పవన్. ఈ నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

Also Read:KTR: ఆగమైపోతున్న తెలంగాణ

- Advertisement -