ఆచార్య కోసం భీమ్లా నాయక్!

50
pawan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

హైదరాబాద్ లోని యూసఫ్‌‌‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌‌‌లో ఏప్రిల్ 23న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ లుగా రానున్నారని సమాచారం.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటైర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమాపై తెలుగు సినీ వర్గాలలో భారీ అంచనాలున్నాయి. చాలాకాలం తర్వాత మెగా బ్రదర్స్ కలిస్తే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -