ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హిట్ సంతరించుకుంది. ఇప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు పార్టీల అధినేతలు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్ధాపించిన పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఈసారి ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగనున్నాడు పవన్ కళ్యాణ్. మార్చి 14న రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సీనియర్ ఎన్టీఆర్ ను సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని చెప్పుకోవాలి.
సీనియర్ ఎన్టీఆర్ 1994 పార్టీ స్ధాపించిన అనంతరం మొదటి సభను రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజి మైదానం నుంచే ఎన్నికల శంఖారావం ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించిన ఎన్టీఆర్ 1994లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఇదే సభలో పవన్ జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు మరో సెంటిమెంట్ కూడా ఉంది. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈసభకు మరో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఎన్నికల్లో రాజమండ్రి ఆర్ట్స్ మైదానం ప్రచారం ప్రారంభించి ఘన విజయం సాధించిన ఎన్టీఆర్..నేడు సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తాడో చూడాలి.