పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ

39
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ‘మైడియర్ మార్కండేయ’ అంటూ సాగే తొలి పాట విడుదల కానుంది. మంచి ఎనర్జీతో డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చిత్రయూనిట్ అభిమానులకు సూచించింది. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది. అన్నట్టు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇదే విషయం పై ‘బ్రో’ టీమ్ మెంబర్స్ ను అడిగితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని.. నిజానికి ఇప్పటి వరకూ ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని, సినిమాలో ఇంకా మరో మూడు యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

గతంలో, ‘శంభో శివ శంభో’ సినిమా చేసి డైరెక్టర్ గా సముద్రఖని సూపర్ హిట్ కొట్టాడు. అందుకే, ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అప్పీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోందో చూడాలి. ఇక యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మరియు బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read:KTR:బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి

- Advertisement -