మళ్ళీ రీమేక్‌ పైనే కన్నేశాడు..

252
Pawan Kalyan eyeing another remake?
- Advertisement -

ఛాన్స్‌ దొరికితే చాలు రీమేక్ సినిమాలపైనే కన్నేస్తాడు పవన్ కల్యాణ్. ఎందుకంటే పవన్‌ కెరీర్ గ్రాఫ్ కూడా ఇదే చెబుతుంది. ఇటీవలి కాలంలో అయితే.. పవన్‌వి రీమేక్ సినిమాలే ఎక్కువ కావడం గమనార్హం. తాజాగా ఇప్పుడు మరో రీమేక్‌పై దృష్టి పెట్టాడంట పవర్ స్టార్. బాలీవుడ్‌లో కామెడీతో సూపర్ హిట్ దక్కించుకున్న అక్షయ్ కుమార్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట.
 Pawan Kalyan eyeing another remake?
ఇటీవలే విడుదలైన అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్‌బీ చిత్రాన్ని పవన్ తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యాడని ఫిల్మ్‌నగర్ లో జోరుగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ సర్వసాధారణ చిన్న వకీలు.. అమాయక వ్యక్తి, తీవ్రవాది, అవినీతి పోలీసుల కేసును టేకప్ చేసి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడన్నదే జాలీ ఎల్ఎల్‌బీ కథ. అయిఏ ఈ కోర్ట్ రూమ్ డ్రామాలోని స్క్రీన్ ప్లే పవన్‌కు చాలా బాగా నచ్చేసిందట.
 Pawan Kalyan eyeing another remake?
దీంతో వెంటనే హారిక హాసిని క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎస్. రాధాకృష్ణకు ఆ విషయం చెప్పాడట. పవన్ చెప్పడంతో ఆ సినిమా రీమేక్ రైట్స్‌ను ఇప్పటికే రాధాకృష్ణ తీసేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలోనే.. త్రివిక్రమ్ తో చేస్తోన్న సినిమా పూర్తి కాగానే, పవన్ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

- Advertisement -