పాప్ సింగర్ పై అమల సెటైర్లు..!

200
Amala Paul is so serious on Justin Bieber
- Advertisement -

బ్లాక్ బ్యూటీ అమలాపాల్‌ పేరు గత రెండు మూడు నెలల నుంచి హాట్‌ టాపిక్ మారిన విషయం తెలిసిందే. పెళ్లైన ఏడాదికే విభేదాలతో భర్తతో విడాకులు తీసుకుని అందరి నోటా నానింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా అమ్మడు మరో వార్తతో మీడియా దృష్టిని ఆకర్షించింది.
 Amala Paul is so serious on Justin Bieber
ఆ మధ్య ధనుష్ సరసన వీఐపీ-2లో నటించే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో కాస్త తీరిక ఎక్కువైపోయిందట అమ్మడికి. ధనుష్ సినిమా చేజారిపోయినా ఎక్కడా వెనక్కి తగ్గని అమలాపాల్.. మరోవైపు జనాల దృష్టిలో ఉండేందుకు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతోంది.

ఇందులో భాగంగానే ఇటీవలే ఇండియాకు వచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌పై సెటైర్లు వేసింది. చేతిలో పక్షులతో దిగిన ఫొటోలను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేస్తూ బీబర్ కన్నా ఇవే బాగా పాడుతాయని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన సినీ పెద్దలు, ఆమె అభిమానులు అమలా ఏంటి ఒక్కసారిగా ఇలా అనేసిందంటూ అవాక్కయ్యారట.
 Amala Paul is so serious on Justin Bieber
జస్టిన్ బీబర్ ముంబైలో నిర్వహించిన కాన్సేంట్ ఎంతోమందిని ఉర్రూతలూగించినా కొందర్ని మాత్రం నిరాశపరిచింది. కేవలం లిప్ సింక్‌తో పనికానిచ్చేసిన సింగర్ అభిమానులను నిరూత్సాహపరిచాడు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీలకు సరైన సెక్యూరిటీ కూడా చేయలేదన్న సంగతి తెలిసిందే.

ఇదే విధంగా అమలాపాల్ కూడా కాన్సేంట్ వెళ్లి తిరిగివచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ బాధతోనే అమ్మడు ఇలా పాప్ స్టార్‌‌పై అక్కసు వెల్లగక్కిందట. మరి తీరిక ఎక్కువైపోయిన అమలను ఇకనైనా దర్శకనిర్మాతలు ఇకనైన కరుణిస్తారేమో వేచి చూడాల్సిందే.!

- Advertisement -