పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండవ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటివలే వారిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. రేణుదేశాయ్ ఎంగేజ్ మెంట్ చేసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఆమెకు శుభాకాంక్షాలు కూడా చెప్పాడు. ఈసందర్భంగా తన పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానో పలు కారణాలు కూడా చెప్పింది. ఇటివలే రేణుదేశాయ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నేను రెండొ పెళ్లి చేసుకుంటానని చెప్పగానే కొంత మంది వ్యక్తులు తనను బెదిరించారని చెప్పింది. నన్ను, నాకు కాబోయే భర్తను ఇద్దరిని చంపేస్తామంటూ బెదిరించారని తెలిపింది. అందుకే నేను నా రెండవ పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడటం లేదని..ఇంతవరకూ తనకు కాబోయే భర్త ఫోటోలు కూడా చూపించకపోవడానికి అదే కారణం అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు కావాలని మొదట తానే అడిగానని చెప్పింది. తనకు కాబోయే భర్తకు ఎటువంటి హాని కలగకూడదని అతని గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదని చెప్పారు. తనకు కాబోయే భర్త సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాడని..పెళ్లి అయిన తర్వాత ఆయన గురించి అన్ని విషయాలు చెబుతానని తెలిపింది. మాది ప్రేమ పెళ్లి కాదని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తమ ఫ్యామిలీలు కలిసాయని చెప్పారు. ఇంతకు ముందు వాళ్లు యూఎస్ లో ఉండే వారని..కొన్ని నెలల క్రితం నుంచి పూణెలోనే ఉంటున్నారని చెప్పింది.