పవన్ పోకిరి మిస్సయ్యాడు.. మహేష్..?

232
- Advertisement -

అన్నీ అనుకున్నట్టు జరగవు. రాసిపెట్టి ఉండాలి. అది నిజమే ఏది ఎవరికి చెందాలో దేవుడు ముందే డిసైడ్ చేస్తాడు. అది జీవితమైనా ఇంకేదైనా. సినిమాఫీల్డ్ ఇందుకు అతీతమైందేమీ కాదు. ఫలానా కథ, ఫలానా హీరోనే చెయ్యాలనే రూల్ లేదు. రాసిపెట్టి ఉన్నా హీరోకే ఆ అవకాశం దక్కుతుంది. గతంలో ఎంతో మంది హీరోలకు అలాగే జరిగింది. ఇప్పుడు మహేష్ విషయంలోనూ అదే జరుగుతోందా? హావ్ ఏ లుక్.

పోకిరి, బిజినెస్ మ్యాన్ తరువాత ఇప్పుడు మహేష్‌తో మూడోసారి కూడా హిట్ కొట్టాలని కసితో వున్నాడు పూరీ. ఈ క్రమంలో జనగణమన అనే టైటిల్‌తో ఓ పవర్ ఫుల్‌స్టోరీని కూడా రెడీ చేశాడు. అయితే మహేష్ ఈ సినిమా చేయడానికి సిద్ధంగా లేడు. మురుగదాస్‌ మూవీ తర్వాత ప్రిన్స్ కొరటాల శివతో మూవీకి రెడీ అవుతున్నాడు.

business

ఆ తరువాత కూడా పూరితో చేస్తాడన్న నమ్మకం లేదు. ఎందుకంటే వంశీ పైడిపల్లి మహేష్ కోసం కాచుకు కూర్చున్నాడు. దీంతో పూరి జనగణమన స్టోరీని ఎన్టీఆర్‌తో చేయాలని చూస్తున్నాడట. పూరి కెరియర్ లో ఒక హీరోని అనుకుని మరో హీరోతో సినిమాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజానికి పూరి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ పోకిరిలో పవన్ నటించాల్సింది. కానీ, అది మహేష్ కు రాసిపెట్టి ఉంది. ఆ సినిమా హిట్ తో మహేష్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అలాగే ఇప్పుడు మహేష్ కోసం సిద్ధం చేసిన జనగణమన స్టోరీ కూడా జూనియర్‌ కు రాసిపెట్టి ఉందేమో. అది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

- Advertisement -