తారక్ ఫ్యాన్స్‌కి ఆ ఛానల్ కి మధ్య గొడవేంటి?

267
NTR Fans Hungama
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓ తెలుగు ఎంటైర్ టైన్ మెంట్ ఛానల్ పై కారాలుమిరాయాలు నూరుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపానికి కారణం ఏంటి? ఫ్యాన్స్ కి ఆ ఛానల్ కి మధ్య గొడవేంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.

Janata_garage

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే పని ఏం జరిగిందనే కదా మీ డౌట్. జనతా గ్యారేజ్ తారక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ. కలెక్షన్ల పరంగా టాలీవుడ్ టాప్ 3 మూవీస్ లో నిలిచింది గ్యారేజ్. ఇటీవలే ఈ చిత్రం 39 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే కనీసం 100 రోజులైన థియేటర్లలో సందడి చేయకముందే ఈ చిత్రం దీపావళికి బుల్లితెరపై ప్రసారం కాబోతుంది. ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. ఇంత తక్కువ టైంలోనే సినిమా టీవీలో ప్రసారం అయితే.. రికార్డులు మిస్సవుతాయని తారక్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

Janatha-Garage-Audio-Poster-3

అందుకే సదరు ఛానల్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛానల్ యాజమాన్యం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. కోట్లు పెట్టి జనతా గ్యారేజ్ శాటిలైట్స్ రైట్స్ దక్కించుకోడంతో.. దీపావళి రోజున యాడ్స్ రూపంలో భారీగా దండుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. మరీ, దీనిపై ఫ్యాన్స్ వెనక్కి తగ్గుతారా? లేక ఆ టీవీ ఛానల్ యాజమాన్యం వెనక్కి తగ్గుతుందా తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.

- Advertisement -