సూపర్ స్టార్‌కు శుభాకాంక్షలు తెలిపిన పవర్‌ స్టార్‌..

231
pawan
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడంతో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రజనీకాంత్ ను ఓ విలక్షణ నటుడిగా పేర్కొన్న పవన్ కల్యాణ్… ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

రజనీకాంత్ కు తన తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. తమిళ ప్రేక్షకులను గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తున్న రజనీకాంత్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని కొనియాడారు. రజనీకాంత్ తమిళంలోనే కాకుండా, తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారని వివరించారు.

“రజనీకాంత్ మా కుటుంబానికి సన్నిహితులు. దాదాపు 30 ఏళ్ల కిందట అన్నయ్య చిరంజీవితో రజనీకాంత్ బందిపోటు సింహం, కాళీ అనే చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆయన ఇకపైనా మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలి” అంటూ పవన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

- Advertisement -