పవన్ బర్త్ డే వేడుకల్లో విషాదం…జనసేనాని దిగ్బ్రాంతి

193
pawan
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్లెక్సీలు, బ్యాన‌ర్లు క‌డుతుండ‌గా.. క‌రెంట్ షాక్‌తో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల‌ను సోమ‌శేఖ‌ర్, రాజేంద్ర‌, అరుణాచ‌లంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండ‌డం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

తన అభిమానుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. జనసైనికుల మరణం మాటలకందని విషాదమని…దూర‌మైన బిడ్డ‌ల‌ను తీసుకురాలేను.. కానీ వారి కుటుంబాల‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని హామీ ఇచ్చారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌వారికి కూడా అండ‌గా ఉంటామ‌న్నారు ప‌వ‌న్. బాధిత కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన త‌క్ష‌ణ స‌హాయం అదించాల‌ని చిత్తూరు జిల్లా జ‌న‌సేన నేత‌ల‌ను ఆదేశించారు పవన్‌.

- Advertisement -