కోలీవుడ్ టార్గెట్‌గా పవన్‌ వ్యాఖ్యలు!

43
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌..తమిళ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీ తమిళ ఆర్టిస్ట్ లతో మాత్రమే సినిమాలు చేయాలని తీసుకున్న నిర్ణయం సబబు కాదన్నారు. సినిమా పరిశ్రమ అందరిదీ అందరూ అందరితో కలిసి వర్క్ చెయ్యాలని ఏ ఎం రత్నం లాంటి తెలుగు నిర్మాత తమిళ్ లో కూడా చిత్రాలు విజయం సాధించలేదా అని గుర్తు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీ తమ నిర్ణయం పట్ల మరోసారి సమాలోచన చేయాలని సూచించారు.

Also Read:కార్గిల్ విజయ్ దివస్..వీర జవాన్ల యాదిలో

సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందినది కాదు. మా కుటుంబానికి కూడా చెందినది కాదు.. ఇది అందరిదీ. ఈ కోట్లాదిమందిలో ఎవరైనా సరే బలంగా అనుకుంటే ఇక్కడ రాణించగలరు. చిరంజీవి దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. అప్పుడు మా వెనక ఎవరు లేరు. చిరంజీవి హీరో అవుతావా అని అడిగినప్పుడు నాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదు. నా ఊహ అంతా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకోవాలి, ఎక్కడైనా దూరంగా పొలంలో పని చేసుకోవాలి. అంతకుమించి కోరికలు లేవు. కానీ నాకు సాహిత్యం, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టముండేది. దానివల్ల ఎటూ తేల్చుకోలేకపోయాను. అప్పుడు మా వదిన గారు నాకు మార్గనిర్దేశం చేశారని గుర్తు చేశారు.

Also Read:అగ్రనేతల పోటాపోటి టూర్స్..!

- Advertisement -