పెద్ద నోటు రద్దుపై పవన్ షేర్‌ చేసిన కవిత…

211
pawan kalyan comments on demonetisation
pawan kalyan comments on demonetisation
- Advertisement -

‘మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్దపోగేస్తే
దొంగ కూడంటున్నారన్నా నేనెట్టా బతికేది?
కన్నీటి బొట్టూ బొట్టూ దాపెట్టి ఏడుపు పోగేస్తే
నా ఏడుపు చెల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది’ పెద్దనోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన తెలియజేసే ఈ కవితను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్లో షేర్ చేశారు.

పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుండి మోడీ సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సెలబ్రిటీలు స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. కొత్త కరెన్సీపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసంఘటిత పట్టణ మార్కెట్‌ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని తన ట్వీట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్‌ సిటిజన్స్‌ గురించి కూడా పట్టించుకోవాలని.. ప్రజల్లో అశాంతిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ రచయిత సాయిమాధవ్‌ రాసిన కవితను పవన్‌ కల్యాణ్‌ షేర్‌ చేసుకున్నారు.

pawan kalyan comments on demonetisation

- Advertisement -