మెగా దీపావళి….చిరు ఇంట్లో పవన్‌ సందడి

775
pawan diwali

దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మెగా బ్రదర్స్‌. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో సతీసమేతంగా హాజరయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,నాగబాబు. ముఖ్యంగా పవన్‌ తన నలుగురు పిల్లలు (రేణుదేశాయ్‌) అకీరానందన్,ఆద్య, అన్నాలెజెనెవో పిల్లలు మార్క్ శంకర్ పవనోవిచ్,పొలెనా అంజన పవనోవతో కలిసి పాల్గొన్నారు.

pawan

త‌ల్లి అంజ‌నాదేవీతో క‌లిసి చిరంజీవి, సురేఖ, నాగ‌బాబు అండ్ ఫ్యామిలీ, ప‌వ‌న్ అండ్ ఫ్యామిలీ స‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యులు దీపావ‌ళి సంబ‌రాల‌ను జ‌రుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తున్న పవన్ అభిమానులు మెగా బ్రదర్స్ అందరినీ ఒకే చోట చూసి మురిసిపోతున్నారు.

Image