విత్తనోత్పత్తిని భారీగా పెంచండి- నిరంజన్ రెడ్డి

478
niranjan reddy
- Advertisement -

యాసంగి విత్తనోత్పత్తి, వచ్చే ఏడాది విత్తన సరఫరాకు సంబంధించి విత్తనాభివృద్ది సంస్థ అధికారులతో హాకా భవన్‌లో సమావేశంలో జరిగింది. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, సంస్థ డైరెక్టర్ కేశవులు హజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో విత్తనోత్పత్తిని భారీగా పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. ఉత్పాదకత మరియు నాణ్యత కలిగిన కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయలని.. కెఎన్ఎం 118, ఎంటియు 1010, ఆర్ఎన్ఆర్ 15048 కొత్త వరి వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే టొమాటో, మిరప, బెండ మొదలగు కూరగాయల విత్తనోత్పత్తి కూడా ప్రాధాన్యం ఇవ్వండి అని అన్నారు.

Minister Singireddy Niranjan Reddy

గతంలో కన్నా 5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెంచుతూ 2019 – 20 సంవత్సరానికి 8.07 లక్షల క్వింటాళ్లు విత్తన ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని 33 జిల్లాలలో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు  గాను 40,253 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

వచ్చే నవంబరు మొదటివారం వరకు విత్తన సరఫరా జరుగుతుంది. శనగ విత్తన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడండి. ఇందుల కోసం రైతులకు అవసరం అయిన విత్తనాలు అన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. 2020 – 21 సంవత్సరానికి గాను వేరుశనగ సరఫరాకు 80 వేల క్వింటాళ్లు లక్ష్యంగా ఈ యాసంగిలో విత్తనాలను ఉత్పత్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -