పవన్‌కు నోటు పోటు..

209
Pawan Kalyan at Bank for notes Exchange
- Advertisement -

సామాన్యుల‌కే కాదు సెల‌బ్రిటీల‌కు కూడా క‌రెన్సీ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. పెద్ద నోట్ల రద్దుతో యావత్ భారతం బ్యాంకుల ముందు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజురోజుకు బ్యాంకుల ముందు క్యూ లైన్లు పెరిగిపోతున్నాయే తప్ప…..ప్రజల ఇబ్బందులు మాత్రం తొలిగిపోవటం లేదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలు సైతం నోట్ల పాట్లు పడాల్సివస్తోంది.

తాజాగా ప‌వ‌ర్‌స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా హైద‌రాబాద్ లోని ఓ బ్యాంకుకి వెళ్ళి న‌గ‌దు మార్చుకున్నారు. ప‌వ‌న్ బ్యాంకులో నోట్లు మార్చుకుంటున్న ఓ ఫోటో, సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తి బ్యాంకు వద్దకు వచ్చి నోట్లు మార్చుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. దీంతో పవన్ రంగ ప్రవేశంతో బ్యాంకు పరిసర ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ ను చూసేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. అయితే పవర్ స్టార్ మాత్రం తాను వచ్చిన పని పూర్తికాగానే తిరుగుముఖం పట్టారు.

పవన్ వ్యక్తిత్వం ఇదంటూ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒక సామాన్యుడి మాదిరి బ్రతకడానికి పవన్ ఎంతలా తాపత్రయపడతారో చెప్పడానికి ఒక ఉదాహరణ అని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమైతే రోజులు కేవలం 4500 రూపాయలు మాత్రమే బ్యాంకులు మార్చాల్సి ఉంటుంది. దీంతో పవన్ కూడా అంతే మొత్తాన్ని తీసుకుని, మిగతా అంతా డిపాజిట్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది. ఎంత తీసుకున్నా… ఎంత డిపాజిట్ చేసినా… తనంతట తానూగా పవన్ రావడం సంథింగ్ స్పెషలే కదా!

modimohter

నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరా బెన్ కూడా స్వయంగా బ్యాంకుకు వెళ్లి నోట్లు మార్పిడి చేసుకున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో ఓరియంటల్ బ్యాంకుకు వెళ్లి తన దగ్గరున్న డబ్బును మార్చుకున్నారు. రూ. 4వేల 500 రూపాయలు పాతవి ఇచ్చి.. కొత్త నోట్లు తీసుకున్నారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమస్పందన వచ్చింది. కొంతమంది మోడీని కీర్తించగా…మరికొంతమంది మాత్రం 94 ఏళ్ల వయసున్న తల్లిని క్యూలో నిలబెట్టారంటూ ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

- Advertisement -