క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ పార్టు పూర్తికాగా తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్నారు పవన్. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్నారు పవన్.
పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేకమైన సెట్లు తీర్చిదిద్దారు. అందులోనే సింహభాగం షూటింగ్ జరుగుతోంది. స్వల్ప విరామం తరవాత సోమవారం పవన్ కల్యాణ్ మళ్లీ సెట్లో అడుగుపెట్టారు. పవన్ కల్యాణ్, ఇతర కీలక పాత్రధారుల మధ్య ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ జులై వరకూ సుదీర్ఘంగా సాగుతుంది. మధ్యమధ్యలో ఒకట్రెండు రోజులు స్వల్ప విరామం తప్ప… చిత్రీకరణకు ఎక్కడా బ్రేకుల్లేవు అని చిత్రబృందం తెలిపింది.