Pawan:ఈసారైనా పవన్ గెలిచేనా?

36
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈసారి ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పార్టీ స్థాపించి పదేళ్ళయిన ఇప్పటివరకు పవన్ పార్టీకి అధికారిక గుర్తింపు దగ్గలేదు. దాంతో ఈసారి జనసేన సత్తా చాటకపోతే ఆ పార్టీ మరుగున పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అధినేతగా పవన్ గెలుపొందడం ఆ పార్టీకి ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ రెండు చోట్ల కూడా పరాజయం పాలయ్యారు. అత్యంత ప్రజాధరణ కలిగిన సినీ హీరో అయినప్పటికి ఆయన ఓటమి చవిచూడడం నిజంగా అందరినీ ఆశ్చర్య పరిచిన విషయమే. పైగా గత ఎన్నికల్లో సత్తా చాటుతుందని భావించిన పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయింది. .

దాంతో ఈసారి పవన్ గెలవడంతో పాటు పార్టీకూడా మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం తప్పనిసరిగా మారింది. ఇదిలా ఉండగా పవన్ పోటీ చేసే స్థానంపై గతకొన్నాళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గాజువాక, పిఠాపురం, భీమవరం.. ఇలా చాలా నియోజక వర్గాల పేర్లే తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా గత ఎన్నికల్లో మాదిరి పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారా లేదా ఒకే స్థానంలో బరిలోకి దిగుతారా అనేది ఆకుద ప్రశ్నార్థకంగానే ఉంది. తాజాగా పవన్ పోటీ చేసే స్థానంపై పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ అధినాయకులు మాత్రం పవన్ పోటీపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చంద్రశేఖర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ప్రస్తుతం జనసేన సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమేనట. పైగా గత ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈసారి కేవలం ఒకే స్థానంలో బరిలో దిగేందుకు పవన్ సిద్దమౌతున్నట్లు టాక్. మరి జనసేనాని ఈసారైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారేమో చూడాలి.

Also Read:POW సంధ్యని పరామర్శించిన కవిత

- Advertisement -