షాక్‌…క్రిష్‌ను పక్కనపెట్టిన పవన్!

21
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తికాగా ఆ తర్వాత వరుస బ్రేక్‌లు పడుతు వచ్చింది. కారణాలు ఏవైనా ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నాడని వార్తలు వస్తుండగా తాజా అవి నిజమయ్యాయి.

ఇవాళ హరిహర వీరమల్లు టీజర్‌ రిలీజ్‌తో పాటు దర్శకుడు మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే క్రిష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తిచేస్తాడ‌ని మేకర్స్ వెల్లడించగా ఏఎమ్ రత్నం తనయుడే జ్యోతి కృష్ణ. గతంలో నీ మ‌న‌సు నాకు తెలుసు, ఆక్సిజ‌న్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ మొద‌లై నాలుగేళ్లు దాటగా ఈ సినిమా రిలీజ్‌ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా కారణం ఏదైనా ఓ ఫ్లాప్ దర్శకుడి చేతిలో హరిహర వీరమల్లును పెట్టగా రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

పవన్ సరసన నిధి అగ‌ర్వాల్‌, నోరా ఫ‌తేహి హీరోయిన్లుగా న‌టిస్తుండగా బాబీడియోల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను షూటింగ్ పూర్తికాక‌ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డ్ ధ‌ర‌కు సొంతం చేసుకుంది.

Also Read:యూనిక్ కాన్సెప్ట్‌తో ‘ప్రసన్న వదనం’

- Advertisement -