టీడీపీ రూట్ మ్యాప్.. పవన్ చేతిలో?

37
- Advertisement -

జనసేన మరియు టీడీపీ మద్య అధికారిక పొత్తు ఏర్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జైల్లో జరిగిన మూలాఖత్ తరుయాత పవన్ టీడీపీతో పొత్తును కన్ఫర్మ్ చేశారు. అయితే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని పవన్ చెప్పినప్పటికి.. ఇరు పార్టీల వ్యూహాలు, తదుపరి కార్యాచరణ, సీట్ల పంపకలు వంటి వాటిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం అధినేత చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీ గందరగోళ పరిస్థితిలో ఉంది. ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా ప్రస్తుతం చంద్రబాబును బయటకు తీసుకొచ్చే దానిపైనే దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. .

మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ పై కూడా పలు స్కామ్ లు అలుముకుంటున్నాయి. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ రూట్ మ్యాప్ మొత్తం పవన్ కు ఇచ్చే విధంగా ఆ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారట. ఇకపై జనసేన తరుపున పవన్ ఎలాంటి కార్యక్రమాలు నిరవహించిన అందులో టీడీపీ నేతలు కూడా ఉండేటట్లు ప్రణాళికలు వేస్తున్నారట.

Also Read:ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ 

 అయితే ఇన్నాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. ఏనాడూ కూడా బీజేపీ నేతలతో కలిసి ఎటువంటి కార్యక్రమాలు గాని బహిరంగ సభలు గాని నిర్వహించలేదు. దాంతో నామమాత్రంగానే బీజేపీతో జనసేన పొత్తులో ఉందనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. టీడీపీ విషయంలో అలాంటి భావన ప్రజల్లో తలెత్తకుండా రెండు పార్టీలు కలిసి నడవలని ఇటు పవన్, అటు టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నారట. దీనిపై చంద్రబాబుతో మూలాఖత్ లో చర్చించాలని ఆ పార్టీ కీలక నేతలు భావిస్తున్నారట. ఇక సీట్ల కేటాయింపులో కూడా ఇరు పార్టీలు ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ముందురోజుల్లో జనసేన, టీడీపీ కలిసి ఎలాంటి ప్రణాళికలు రచిస్తాయో చూడాలి.

Also Read:యాక్షన్ సీన్స్‌లో ‘గుంటూరు కారం’!

- Advertisement -