పవన్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

1
- Advertisement -

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జన్యుపరమైన (జెనెటిక్) వ్యాధితో పోరాడుతున్న నిరంజన్, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈ వార్త పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు జనసేన శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గత నెలలోనే నిరంజన్ పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్, స్వయంగా అతడిని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పవన్‌ను కలవాలనే తన జీవితకాల కోరిక తీరడంతో నిరంజన్ ఎంతో సంతోషించాడు. ఆ సమయంలో నిరంజన్ ఇష్టాన్ని గమనించిన పవన్ కల్యాణ్ కుక్కపిల్లను కూడా బహుమతిగా ఇచ్చారు.

ఆత్మీయ పరామర్శ సమయంలో నిరంజన్‌తో పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేకమైన మాట చెప్పారు. తన రాబోయే చిత్రం ‘ఓజీ 2’ (OG 2) సినిమాను మనమిద్దరం కలిసి కూర్చుని చూద్దామని పవన్ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆ మాటకు ఎంతో సంబరపడిన నిరంజన్, ఆ క్షణం కోసం ఎంతో ఆశగా ఎదురుచూశాడు.

కానీ, అంతలోనే కాలం ఆ కుర్రాడికి సమయం ఇవ్వలేదు. సినిమా విడుదలై, తన అభిమాన హీరోతో కలిసి వెండితెరపై చూసే భాగ్యం కలగకుండానే నిరంజన్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. నిరంజన్ మరణంతో హనుమకొండలో విషాద ఛాయలు అలముకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పవన్ అభిమానులు నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం

- Advertisement -