విజయనిర్మల మల్టీటాలెంటెడ్‌:పవన్

507
pawan
- Advertisement -

విజయ నిర్మల మరణం చాలా బాధ కలిగించిందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ నానక్ రాం గూడలోని విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్ కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా సత్తచాటి మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. విజయ నిర్మల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు పవన్‌.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల నిన్న రాత్రి హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రి గుండెనొప్పితో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించారు.

ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు.

- Advertisement -