Nani:దసరా ఓటీటీలోకి ఎప్పుడంటే..!

35
- Advertisement -

టాలీవుడ్ సినిమా చరిత్రలో ఈ మధ్య తెలంగాణ యాస తెలంగాణ సంస్కృతి వేషధారణ ఆచారాలు సంప్రదాయాలతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా కూడా ఇదే కోవకు చెందినది. గత నెలల్లో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎన్నో యేళ్లుగా కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నానికి మాత్రం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే గాకా వంద కోట్ల క్లబులో చేరింది.

Also read: Naresh:మళ్లీ పెళ్లి అప్‌డేట్

తెలంగాణకు చెందిన శ్రీకాంత్ ఓదేల తన మార్కింగ్ టేకింగ్ నాని కీర్తి సురేష్ నటనతో దసరా సినిమా అమాంతం బజ్‌ పెంచేసుకుంది. దసరా ఇప్పటివరకు రూ.120కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్‌ చేసింది. ఇక ఓవర్సీస్‌లో 2మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.

Also read: పిక్ టాక్ : ఒంపుసొంపులతో షేక్ చేసింది

ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దసరా సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోగా..ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీక్షిత్ శెట్టి సముద్రఖని సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో షైన్ టామ్‌చాకో ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

- Advertisement -