పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారికాహాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె హైదరాబాద్‌లో భారీ సెట్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర బృందం తర్వాతి షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్లింది.
20 రోజుల పాటు బల్గేరియాలో పవన్ … కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ లపై రెండు పాటలు షూట్ చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర టైటిల్ టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.‘ఇంజినీర్ బాబు’, ‘దేవుడే దిగి వస్తే’, ‘పరదేశ ప్రయాణం’ వంటి టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ సినిమాకు తాజాగా ‘గోకుల కృష్ణుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది
ఇక పవన్- త్రివిక్రమ్ సినిమాకు రికార్డు స్ధాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 90కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 110 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ ది క్రేజీ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరూ కలిసి జల్సా సినిమా చేశారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా చేశారు. ఈ రెండింటిలో జల్సా సూపర్ హిట్ అయితే, అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమాకు భారీ స్థాయిలో వ్యాపారం సాగుతోంది.