స్వీటీ చెప్పిన మనసులో మాట…

198
Anushka Interested Malayalam Movies
- Advertisement -

అనుష్క స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అని వేరే చెప్పక్కర్లేదు. తెలుగు- తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న ఈ అరుంధతి ఇప్పటికే కొన్ని నిలిచిపోయే పాత్రల్లో నటించింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా ఇప్పటికీ అందచందాలతో యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది. తమిళం, మలయాళ భాషలలోను ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఏ భాషలో అయిన తన స్థాయికి తగిన సినిమాలు చేయడానికి మాత్రమే ఆసక్తిని చూపుతోంది అనుష్క. ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు వేసిన అనుష్క తన మనసులో మాట ఇలా బయట పెట్టింది.

Anushka Interested Malayalam Movies

అయితే మలయాళీ ప్రేక్షకులకు సినిమాలపై మంచి అవగాహన ఉందనీ, అక్కడి సినిమాల్లో కథాబలం ఉంటుందనే విషయం తాను సినిమాల్లోకి వచ్చాక అర్థమైందని చెప్పింది అనుష్క. భారతీయ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా మలయాళ సినిమా చేయగలదు అని మా నాన్న ఓసారి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని అనుష్క చెప్పుకొచ్చింది. తాను మలయాళ సినిమా చేయవలసి వస్తే స్క్రిప్ట్ మాత్రమే చూస్తానని, మిగతా విషయాలు పట్టించుకోనని పేర్కొంది. ప్రస్తుతం ఈ స్వీటి భాగమతి సినిమాతో బీజీగా ఉంది.

- Advertisement -