పవిత్రాతో పెళ్లి.. నరేశ్ మెయిన్ ప్లాన్ అదే

21
- Advertisement -

ఎట్టకేలకు సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకున్నారు. మంచిదే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను నరేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముళ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, నరేష్ తన మూడో భార్య రమ్యతో విడాకులు కాకుండానే పవిత్రను పెళ్లిచేసుకున్నాడు.

నరేశ్ అంగరంగ వైభవంగా తన కొత్త పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. పవిత్రాతో మరికాసేపట్లో పెళ్లి జరుగుతోంది అనగా..? ఆపాలి అంటూ నరేశ్ మూడో భార్య రమ్య మరియు కొందరు మహిళలు అక్కడకు వచ్చారు. దీంతో మండపంలో ఉన్నవారంతా షాక్ గురయ్యారు. చిన్నపాటి గొడవ జరిగింది. రమ్య ఆవేశంతో ఊగిపోతూ నరేశ్ కి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పవిత్రా లోకేష్ సిగ్గు పడుతూ మూడు ముళ్లు వేయించుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది.

మొత్తమ్మీద నరేశ్ తన నాలుగో పెళ్లిని చేసేసుకున్నాడు. చట్ట విరుద్ధంగా. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. మూడో భార్య రమ్యతో కోర్టులో విడాకుల కేసు ఉండగానే, ఆమెకు న్యాయం చేయకుండానే.. భర్త నరేశ్.. నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యమే. అయితే, నరేశ్ ఇంతగా తెగించడానికి ఓ కారణం ఉంది. ఇష్యూ పెద్దది అయితే.. ఇదంతా షూటింగ్ లో భాగంగా చేసింది అని ఎస్కేప్ కావాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

ప్రకృతి ఒడిలో సేద తీరిన ముద్దుగుమ్మలు

సర్జరీ తర్వాత నా ముఖం చూస్తే…

ఎన్టీఆర్‌..రెడ్‌కార్పెట్‌పై మేం కాదు భారతీయులు…

- Advertisement -