TTD: ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యంలో ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

5
- Advertisement -

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా చేప‌ట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ త‌రువాత ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

Also Read:Harishrao:బుచ్చమ్మది ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యే

- Advertisement -