నటి పవిత్ర తో వీకే నరేష్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఈ జంట సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వస్తుంది. అయితే ఈ మధ్య పవిత్ర , నరేష్ లిప్ లాక్ పెట్టుకుంటూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్న వీడియో వదిలారు. దీంతో అందరూ ఈ జంటకి కంగ్రాట్స్ చెప్పారు. కానీ దీని వెనుక అసలు వేరే మీటర్ ఉంది. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టి అందరినీ ఫూల్స్ చేశారు పవిత్రా నరేష్.
ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో పవిత్రా నరేష్ జంటగా ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తనే స్వయంగా నిర్మిస్తున్నాడు నరేష్. విజయ కృష్ణ మూవీస్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మళ్ళీ పెళ్లి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. పవిత్ర ఇంటి బయట ముగ్గు పెడుతుంటే నరేష్ పక్కనే మోకాలి మీద కూర్చొని ఆమెను శ్రద్దగా చూస్తున్న స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ మధ్య బొల్డ్ కంటెంట్ తో రొమాంటిక్ సినిమాలు తీస్తున్న ఎమ్మెస్ రాజు ఈ జంట నిజ జీవిత కథతోనే మళ్ళీ పెళ్లి తీస్తున్నారు. నరేష్ జీవితంలో అలాగే పవిత్ర జీవితంలో ఎదురై సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సినిమాకి వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..