పెళ్లి మాట ఎత్తితే మండిపడుతోంది!

297
- Advertisement -

మీ పెళ్లి గురించి ఇంకో ప్రశ్న లేదా? అని అడిగితే.. పవిత్రా లోకేష్ చిర్రుబుర్రులాడుతోంది. పవిత్రా లోకేష్, సీనియర్ నరేష్ గత నెలలుగా ఘాటు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. పైగా ఈ ముదురు జంట తమ బాగోతాన్ని దాచడానికి కూడా ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. ఏదైనా బహిరంగమే. ఆ మధ్య పవిత్రా లోకేష్, నరేశ్ ఇంటికి వెళ్తూ వస్తూ అనేకసార్లు మీడియా కంటికి చిక్కింది. తమని ఫోటోలు తీస్తున్న మీడియాపై చిరాకుపడ్డాడు కూడా. ఇప్పుడు పవిత్రా లోకేష్ కన్నడ మీడియా పై అలాగే మండిపడుతోంది. ఇటీవల పవిత్రా లోకేష్, నరేశ్ తో పెళ్లికి యస్ చెప్పాను అని అర్ధం వచ్చేలా ఒక కామెంట్ చేసింది.

ఆ తర్వాత ఏమైందో ఏమో తూచ్ అనేసింది. అయితే, ఈ విషయం పై కన్నడ మీడియా వాళ్ళు పవిత్రాతో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అడిగారు. నరేశ్ తో తన పెళ్లి గురించే ప్రశ్నిస్తున్నారు అని అర్థం చేసుకున్న ఈ ఆంటీ, పెళ్లి అనే ప్రశ్న తప్ప మీడియా వాళ్లకు ఇంకోటి రాదా అంటూ మండిపడింది. సడెన్ గా పవిత్రా లోకేష్ కి ఏమైంది ? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ పవిత్రా లోకేష్ – సీనియర్ నరేష్ మేటర్ పెళ్లి వరకు వెళ్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇద్దరూ గతంలో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు నడిపిన వారే. పైగా ముదురు వయసులో డేటింగ్ మేటర్స్ పెళ్లి వరకు వెళ్లే సందర్భాలు తక్కువే. బహుశా.. అందుకే పవిత్రా లోకేష్ కి ఆ మాట ఎత్తితే కోపం వచ్చినట్లుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -