మెగా ఫ్యామిలీ..హీరోగా పవన్ తేజ్‌..!

591
pawan tej
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. రామ్ చరణ్‌కు తమ్ముడు వరసయ్యే పవన్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. అభిరామ్ దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మాతగా సినిమా రాబోతుంది.

ఈ సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పవన్ తేజ్ సరసన హీరోయిన్‌గా మేఘన నటిస్తుండగా మెగా హీరో అనే బ్రాండ్ నేమ్‌తో వస్తున్న పవన్ తేజ్‌ ఈజీగా ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీని రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

పవన్ తేజ్ …మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -