కోడి బతికున్నప్పుడు 90..చనిపోయాక 190

332
nithin

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్‌లో నితిన్ డైలాగ్స్‌..కామెడీ అదిరిపోయింది. కొడి బతికున్నప్పుడు 90…చనిపోయాక 190 అనే డైలాగ్‌లు బాగున్నాయి.

భీష్మతో పాటు నితిన్ చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ ఖరారు చేయగా ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. దీంతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో,వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్నాడు నితిన్.