‘జ‌న‌సేన’ సిద్దాంతాలను ట్వీట్‌ చేసిన పవన్‌

194
pavan kalyan tweet again for janasena
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఉద‌యం నుంచి వ‌రుస‌గా ట్వీట్లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్ళీ ట్వీట్‌ చేశాడు జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కళ్యాణ్‌.  జ‌న‌సేన పార్టీకి ఏ సిద్ధాంతం లేద‌ని, ఓ క్లారిటీ లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే.

త‌మ సిద్ధాంతాలు ఇవేనంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. “కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సాంప్రదాయం.. సంస్కృతులని కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. ఇవి దేశపటిష్టతకు మూలాలు.. ఇవే “జనసేన” సిద్ధాంతాలు..” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

- Advertisement -