అర్జున్‌రెడ్డి అక్కడా మొదలుపెట్టాడు..!

209
- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ దేవరకొండ. లో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి నిర్మాతల పంట పండించింది.ఈ సినిమా తర్వాత విజయ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో తమిళం నుంచి కూడా ఆయనకి అవకాశాలు వస్తున్నాయి. గతంలో విక్రమ్ తో ‘ఇరుముగన్’ చేసిన దర్శకుడు ఆనంద్ శంకర్, ఇటీవల విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో ఆ తమిళ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

Vijay Devarakonda set to make Tamil debut

అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనే విషయంలో సందేహం ఉండేది. ఈ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. స్టూడియో గ్రీన్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తమిళ సినిమాతో .. అక్కడ కూడా మనవాడు తన హవాను మొదలుపెడతాడేమో చూడాలి.

- Advertisement -