రెండో విడత పట్టణప్రగతి కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా మూడోరోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని 7వ వార్డు లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత.
సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామంలో 5లక్షల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత.
హుజూర్నగర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట మండలం సూరారం గ్రామ కాంగ్రెస్ పార్టీ mptc సతీష్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యా సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏనుగులదొరి గ్రామంలో శ్మశానవాటిక పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేదర్ రెడ్డి.