రేవంత్‌కు పరాభవం తప్పదు..

328
patnam narender reddy
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డికి కొడంగల్‌లో పరాభవం తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి,ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేందర్ రెడ్డి ప్రజలు తప్పకుండా రేవంత్‌కు బుద్ది చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలను మభ్యపెట్టి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆరోపించారు. టీఆర్ఎస్,కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలనే తనను గెలిపిస్తాయన్నారు. రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

కొడంగల్‌లో మిషన్ భగీరథ ఆలస్యానికి రేవంతే కారణమని ఆరోపించారు. దమ్ము,ధైర్యం ఉంటే రేవంత్ తనపై గెలవానలి సవాల్ విసిరారు. తనను గెలిపిస్తే కొడంగల్‌లో నాపరాయి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్‌కు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన
వస్తోందని..ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ది జరిగిందన్నారు.

- Advertisement -