పాట్నాలో పడవ బోల్తా..24కు చేరిన మృతులు

94
Bihar

బీహార్ రాజధాని పాట్నాలో సంక్రాంతి పర్వదినాన విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 24 మంది చనిపోయారు. గంగా నదీ తీరంలో శనివారం పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నిన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 40 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. గల్లంతైన మరికొందరి కోసం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు  ప్రమాధ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. బీహార్ ప్రభుత్వం 4 లక్షలు, పరిహారం ప్రకటించింది.

Bihar

పడవ బోల్తా పడిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేయనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు పరిహారంగా ఇస్తారు. ఇప్పటివరకూ 24 మందిని బలిగొన్న ఈ ఘటన నేపథ్యంలో తన బీహార్ పర్యటనను ప్రధాని మోదీ వాయిదా వేసుకున్నారు. పాట్నాలో మహాత్మాగాంధీ సేతు అభివృద్ధి కార్యక్రమం, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగం తదితర కార్యక్రమాలను మోదీ రద్దు చేసుకున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Bihar