దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పింది పతంజలి సంస్థ. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు విచారం వ్యక్తం చేసిన పతంజలి ఎండీ బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. ఇక నుంచి తప్పుదోవ పట్టింటచే ప్రకటనలు చేయబోమని…ఆయుర్వేదం ద్వారా జీవనశైలి సంబంధిత వ్యాధులను నయం చేయడమే కంపెనీ ఉద్దేశమని వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రకటనలు చేయబోమని తెలిపారు.
ఆయుర్వేదం ద్వారా జీవనశైలి సంబంధిత వైద్య సమస్యలకు పరిష్కారాలను అందించడం పతంజలి ఉద్దేశమన్నారు. దీని వల్ల దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై భారాన్ని తగ్గించడమేనని తెలిపారు.
తప్పుడు ప్రకటనలపై యోగా గురు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలను రెండు వారాల్లో వ్యక్తిగతంగా హాజరుకావాలని రెండు కిందట కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పతంజలి.. సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది.
Also Read:మరో సర్వే.. టాఫ్ ఫైట్ ఖాయం?