పఠాన్ దెబ్బకు బాలీవుడ్ ఎమోషనల్

21
- Advertisement -

‘పఠాన్’ మూవీ రిలీజ్ రోజునే ముంబయిలో అభిమానులతో కలిసి సినిమా చూడాలని దీపికా పదుకొణె ఆశించిందట. కానీ, సినిమాపై అప్పటికే వచ్చిన వివాదాల కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఈ సినిమా సక్సెస్ మీట్ లో చెప్పింది. 2007లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో షారూక్ తనకి అవకాశమిచ్చాడని గుర్తు చేసుకున్న దీపికా పదుకొణె, “కష్టపడి పనిచేస్తే ఇలాంటి ప్రశంసలు దక్కుతాయి” అని ఎమోషనల్ అయిపోయింది. ఒక్క దీపికానే కాదు, బాలీవుడ్ మొత్తం పఠాన్ విషయంలో బాగా ఎమోషనల్ అవుతుంది. బాలీవుడ్ మేకర్స్ పని అయిపోయింది అని కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ పఠాన్ మళ్ళీ బాలీవుడ్ మేకర్స్ కి గౌరవాన్ని తీసుకొచ్చింది

అందుకే, పఠాన్ విషయంలో ప్రతిఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అటు నెటిజన్లు సైతం ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ ఏకంగా పఠాన్’ లుక్ లోకి మారిపోయాడు. సోషల్ మీడియాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాక్టివ్‌​గా ఉంటాడు. వార్నర్‌కు ఇండియాలో చాలా మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. తన ఆటతోనే కాకుండా, సినిమా గెటప్స్ తో, సాంగులకు వేసే స్టెప్పులతో అలరించే వార్నర్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు షారుఖ్ ‘పఠాన్’ లుక్ తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు వార్నర్

ఆ మధ్య లాక్‌​ డౌన్ సమయంలో కూడా వార్నర్​ తెలుగు పాటలకు డాన్స్ చేసి మెప్పించాడు. ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ లుక్ లోకి కనిపించి షారుఖ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. మరోపక్క పఠాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అది కూడా ఐదు రోజుల్లోనే. ఇంత త్వరగా ఆ ఫీట్‌ను అందుకున్న తొలి బాలీవుడ్‌ మూవీగా కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. పైగాబాలీవుడ్‌లోనే కాదు తెలుగులోనూ పఠాన్‌ సినిమా వసూళ్ల మోత మోగిస్తుంది.

ఇవి కూడా చదవండి..

దళపతి…దత్‌, ప్రియా

మహేష్ బాబు మేనత్త ఆమె !

#Nani30 గ్రాండ్ గా ప్రారంభం…

- Advertisement -