‘పఠాన్’ కలెక్షన్ల బీభత్సం

32
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై, బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.106 కోట్లు, సెకండ్ డే రూ.113 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. ఓవరాల్‌గా రూ. 219 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. రెండు రోజుల్లో ఒక్క హిందీ వర్షన్ లో రూ.123 కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు.

షారుఖ్‌ ఖాన్‌ లాంగ్ గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు, దీనికితోడు ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి బాగాలేదు, కనీసం పఠాన్ సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ అయినా వస్తాయా ?, రావా ? అని షారుఖ్ ఖాన్ సన్నిహితులు కూడా టెన్షన్ పడ్డారు. కానీ పఠాన్ కలెక్షన్స్ విషయంలో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. షారుఖ్‌ ఖాన్‌ క్రేజ్‌తో పఠాన్‌ ఫస్ట్ వీకెండ్‌లో రూ.400 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే గనుక జరిగితే.. షారుఖ్ సరికొత్త రికార్డ్స్ సృష్టించినట్టే.

అన్నట్టు పఠాన్ చిత్రం ఓ అరుదైన ఘనతను సాధించింది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా కారణంగా 32 ఏళ్లలో తొలిసారిగా సినిమా హాల్ హౌస్‌ఫుల్ అయిందని కశ్మీర్‌లోని ఓ థియేటర్ యజమాని తెలిపారు. “32 ఏళ్ల తర్వాత.. కశ్మీర్ వ్యాలీకి అమూల్యమైన హౌస్‌ఫుల్ గుర్తును తిరిగి తీసుకొచ్చినందుకు కింగ్ ఖాన్‌కు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం.. ధన్యవాదాలు షారూఖ్‌ఖాన్” అని థియేటర్ ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ఆ యజమాని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి…

జబర్దస్త్ కి దిష్టి తగిలిందట!

బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా?

ధోని తొలి ఎంటర్‌టైనర్ ఎల్‌జిఎం..

- Advertisement -