పాత దర్శకులకు కొత్త చిక్కులు

26
- Advertisement -

ఒకప్పుడు కల్ట్ క్లాసిక్స్ బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీని ఊపేసిన దర్శకులు తమను తాము అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుందో బాక్సాఫీస్ సాక్షిగా కళ్ళముందు కనిపిస్తోంది. మొన్న వారం ఎస్వి కృష్ణారెడ్డి ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు అనే కామెడీ సినిమాతో వచ్చారు. రాజేంద్ర ప్రసాద్, బిగ్ బాస్ సోహైల్ టైటిల్ రోల్స్ పోషించారు. డైరెక్టర్ బ్రాండ్ ఉంది కదాని రీజనబుల్ గా ఖర్చు పెట్టి తీశారు. తీరా చూస్తే కనీస ఓపెనింగ్స్ రాలేదు. సరే కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ మెల్లగా వెళ్ళిపోయి జనం థియేటర్లకొస్తారనుకుంటే అదీ జరగలేదు. అసలు మ్యాటరే వీక్ గా ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుంది.

గత శుక్రవారం శివ నాగేశ్వరరావు దోచేవారెవరురాతో ప్రేక్షకులను పలకరించారు. ఏకంగా బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్ లను హీరోలుగా పెట్టడం, అవుట్ డేటెడ్ నెరేషన్ తో సినిమాను తీర్చిదిద్దడంతో చాలా చోట్ల అసలు షోలు రన్ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కృష్ణవంశీ సైతం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న రంగమార్తాండను రిలీజ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. దానికి ఫలితం దక్కుతుందో లేదో 22న తేలనుంది. వీళ్ళే కాదు కొన్నేళ్ల క్రితం గోపీచంద్ తో ఆరడుగుల బులెట్ తీసిన బి గోపాల్ లాంటి వాళ్లందరికీ ఇదే సమస్య

ఇక్కడ చెప్పినవాళ్ళందరూ లెజెండరీ దర్శకులే. అందులో అనుమానం లేదు. కానీ కాలానుగుణంగా కథలు ట్రీట్ మెంట్లు రాసుకోకపోవడంతోనే ఇలాంటి పరిణామాలు తలెత్తతున్నాయి. ఇలా సాధ్యం కావడం లేదని గుర్తించే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు లాంటి మహామహులు ప్రశాంతంగా పర్యవేక్షణ లేదా లేదా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినా లోకేష్ కనగరాజ్, సందీప్ వంగా, నాగ అశ్విన్ లాంటి ఉడుకురక్తాలతో పోటీ పడాలంటే వయసు మీద పడినా మనసు మాత్రం యవ్వనంలో ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి…

సాహో రాజమౌళి

రామ్ చరణ్ కోసం దర్శకుడి వెయిటింగ్

మిస్టర్ కూల్‌తో ఒక స్టిల్‌…

- Advertisement -