మహేశ్‌ 27…డైరెక్ట్ చేసేది నేనే: పరుశరామ్

336
mahesh 27
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ సినిమా తర్వాత తన 27వ చిత్రం ఎవరితో చేస్తారనే దానిపై కొద్దిరోజులుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్పందించారు దర్శకుడు పరుశరామ్. తన నెక్ట్స్ సినిమా మహేష్‌తో ఉంటుందని అఫిషియల్‌గా ప్రకటించారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు.

ఈ సినిమాలో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా విలన్‌గా కన్నడ హీరో ఉపేంద్ర నటించనున్నట్లు టాక్. గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

- Advertisement -